సుజిత్ రెడ్డి, తరుణి సింగ్ జంటగా… వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన… దూరమైన’. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ల ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లతో లాంఛ్ చేయించడంతో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. యూత్ ఫుల్ లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: RGV(శశి)కి తన చెల్లి అక్షర(తరుణి సింగ్)అంటే ప్రాణం. ఎంతలా అంటే ఆమె చదివే కాలేజీలో బాయ్స్ మొత్తం ఆమెను చెల్లిగా చూడాలి అనేంతగా… భయపెడుతుంటాడు. అదే కాలేజీలో సుజిత్(సుజిత్ రెడ్డి) చేరుతాడు. అక్షర… సుజిత్ ని ప్రేమిస్తుంది. అయితే ఓ బలమైన కారణంగా సుజిత్… అక్షర ప్రేమను తిరస్కరిస్తాడు. దానికి కారణం ఏమిటి? తిరిగి వీరిద్దరూ కలుసుకున్నారా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!
కథ…కథనం విశ్లేషణ: స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడిగా సుజిత్ రెడ్డి వెండితెరకు ఈచిత్రం తో పరిచయం చేయడానికి దర్శకుడు ఓ మంచి లవ్… ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న స్టోరీని ఎంచుకోవడం బాగుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిన… సెకెండ్ హాఫ్ లో ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ముఖ్యంగా ఉప్పాడ బీచ్ లో హీరో.. హీరోయిన్ మధ్య ప్రేమ.. ఫ్యామిలీ విలువల గురించి… ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సన్నివేశానికి తగ్గట్టుగా సంభాషణలు రాసుకోవడంతో… బాగా పండింది. గతంలో అనేక ప్రేమకథలు వెండితెరపై చూసుంటాం. కానీ ఇందులో ఉన్న క్లయిమాక్స్ మాత్రం చాలా వైవిధ్యంగా రాసుకోవడం వల్ల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
సుజిత్ రెడ్డికి హీరోగా ఇది డెబ్యూ అయినా… యాక్షన్ సీన్స్ లో మాస్ ను మెప్పించారు. కాలేజ్ స్టూడెంట్ గా… లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. సెంటిమెంట్ సీన్లలోనూ మెప్పించారు. హీరోయిన్ తరుణి సింగ్ బబ్లీగా కనిపించి మెప్పించింది. ‘ఓరి దేవుడో..’ అనే సాంగ్ కి తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రముఖ డైరెక్టర్ దేవి ప్రసాద్ హీరో సుజిత్ తండ్రిగా సెంటిమెంట్ పాత్రల్లో బాగా నటించారు. తల్లి పాత్రలో రాజేశ్వరి నాయర్ కూడా బాగా నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ లో వీరిద్దరూ చక్కగా నటించారు. హీరోయిన్ అన్న పాత్రలో… విలన్ గా నటించిన శశి పాత్ర పవర్ ఫుల్ గా ఉంది. మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీసు ఆఫీసర్ పాత్రలో బెనర్జీ మెప్పించారు.
దర్శకుడు చంద్రశేఖర్ కానూరి ఎంచుకున్న కథ… కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. లవ్, ఫ్యామిలీ డ్రామా సన్ని వేషాలను చాలా చక్కగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో సరదాగా కాలేజ్ సన్నివేశాలను చిత్రీకరణ చేసి… ఆ తరువాత ఫ్యామిలీ డ్రామా సన్ని వేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రించారు. పాటలు బాగున్నాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగుండాల్సింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాతలు ఖర్చు కి ఏమాత్రం వెనకాడకుండా సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉండేలా ఖర్చు పెట్టారు.
రేటింగ్: 3