Shopping Cart 0 items - $0.00 0

కృష్ణ ‘చీకటి వెలుగులు’ చిత్రానికి 45 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణ నటించిన మ్యూజికల్  రొమాంటిక్ లవ్ స్టోరీ ‘చీకటి వెలుగులు. రంజిత్ మూవీస్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా వాణీశ్రీ నటించగా… పద్మప్రియ, కైకాల సత్యనారాయణ, అల్లురామలింగయ్య, సి.హెచ్.నారాయణరావు , రావుగోపాలరావు, మిక్కిలినేని, ముక్కామల, పేకేటిశివరామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1975 లో విడుదలైన ఈ సినిమా 45 ఏళ్ళు పూర్తి చేసు కోవడం విశేషం. ఇక ఈ సినిమాకి సత్యం సంగీతం అందించారు.  ఊరు పేరు లేని వాడ్ని ప్రేమించానమ్మా, చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు, సెలవు మీద రావయ్యా సిపాయి బావా, చూసాను పొద్దంతా వేచాను రాత్రంతా, ప్రేమంటే ఏమనుకున్నావు లవ్ అంటే ప్రేమ, మీటి చూడు నీ హృదయాన్నీ పలుకుతుంది ఒక రాగం, హరి హరి నారాయణా చూడరా నారాయణ లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఒక యుద్ధంలో బాగా గాయపడిన సిపాయి.. ఒక  హాస్పిటల్ లో కళ్ళు తెరుస్తాడు. తన గతాన్ని మరిచిపోయిన అతడికి కొందరు గ్రామస్తులు ఆశ్రయం ఇస్తారు. తనెవరో కనుక్కునే ప్రయత్నంలో ఒకఅమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతకీ ఆ సిపాయి ఎవరు? అతడు తిరిగి తన గతాన్ని ఎలా గుర్తుకు తెచ్చుకుంటాడు అనేదే మిగతా కథ. ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే పే చేసింది.

 

Leave a comment

error: Content is protected !!