కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూత పడడంతో .. డిజిటల్ స్టఫ్ కు ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఈ మార్గం ఎంచుకోనుండడం.. దీన్నో డిజిటల్ రివల్యూషన్ గా భావిస్తున్నారు అందరూ. ఈ నేపథ్యంలో సినిమాలు గా రూపొందడానికి వీలుకాని ఎన్నో ప్రముఖ నవలలు ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలోకి రానుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం డైనమిక్ రైటర్ మ‌ధుబాబు ఫేమ‌స్ న‌వ‌ల `షాడో` ఆధారంగా ఏకే ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర వెబ్ సిరీస్‌ని నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే.  తాజాగా మ‌రో ఫేమ‌స్ నవ‌ల వెబ్ సిరీస్‌గా తెర‌పైకి రానున్నట్టు సమాచారం.

తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచయిత చ‌లం ఒక సంచలనం.  ఆయన ర‌చ‌న‌ల‌కు లక్షల్లో అభిమానులున్నారు. అందులో  `మైదానం`కు ప్రత్యేక స్థానం వుంది. ఆ న‌వ‌ల ఆధారంగా త్వ‌రలో ఓ వెబ్ సిరీస్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ‘నీది నాది ఒకే క‌థ‌, ప్రస్తుతం విరాట‌ప‌ర్వం` వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌త్వం వ‌హిస్తున్న వేణు ఊడుగుల త‌న ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ఓ వ్యక్తిని ఈ వెబ్ సిరీస్ ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడట‌. 1927లో ప్రచురిత‌మైన మైదానం న‌వ‌ల‌ పెను వివాదాన్ని సృష్టించింది. వెబ్‌ సిరీస్‌గా తెర‌పైకి రానున్న ఈ న‌వ‌ల ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!