తమిళ యాక్షన్ హీరో విశాల్ .. లాస్టియర్ అయోగ్య, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆ రెండూ మాస్ యాక్షన్ థ్రిల్లర్సే. అయితే ఈ ఏడాది మనోడు ఓ థ్రిల్లింగ్ మూవీతో రాబోతున్నాడు. సినిమా పేరు ‘చక్ర’. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకక్కుతోన్న ఈ సినిమాను విశాల్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతోంది. యం.యస్. ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణకు లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి .. టీజర్ ను విడుదల చేశారు.
ఎ సైబర్ హాకర్ ఈజ్ నథింగ్ మోర్ దేన్ ఎ బ్యాంక్ రోబర్ యూజంగ్ అనదర్ వెపన్.. హిజ్ మోటివేషన్ ఈజ్ .. అంటూ టీజర్ బిగిన్ అవుతుంది. అందులో ఒక హ్యాకర్ .. టెక్నాలజీ ఉపయోగించి ఒక రోబరీ చేస్తాడు. దానికి పోలీసులు ఎలెర్ట్ అవుతారు. అంతలో విశాల్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. తన గత చిత్రం అభిమన్యుడు తరహాలోనే బ్యాంక్ రాబరీ సైబర్ క్రైమ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అత్యాధునిక సాంకేతిక విలువలతో ఈ చిత్రం తీస్తున్నట్టు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. వీడియోలో రౌడీలకు ఎదుట దుమ్మును దులుపుతున్న విశాల్ లుక్ ఊరమాస్ గా కనిపించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కానుందని ఇందులో సూచించారు మేకర్స్. మరి ఈ సినిమా అభిమన్యుడు తరహాలోనే సూపర్ హిట్టవుతుందేమో చూడాలి.
టీజర్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?time_continue=6&v=DhIqvIJC4A8&feature=emb_logo