Chadalavada Srinivasarao : ప్రముఖ నిర్మాత, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ టాలీవుడ్ సినీ ప్రముఖులు టీఎఫ్‌పీసీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.ఎస్. రామారావు, పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, వీర శంకర్, డైరెక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్, కార్యదర్శి సుబ్బారెడ్డి మరియు అధ్యక్షులు TFPC దామోదర్ ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్ , స్రవంతి ఈ కార్యక్రమంలో రవికిషోర్ , అంబటి శ్రీను , విజయేంద్ర రెడ్డి , శివలింగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు రామోజీరావుకు నివాళులర్పిస్తూ మాట్లాడుతూ.. రామోజీరావు సామాన్యుడి స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్మాత తన భుజాలపై మోయడం మాములు విషయం కాదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోవడం అసాధారణం. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు, ఇప్పుడు రామోజీరావు కూడా అదే కోవలో ఉంటారు. ఎవరినీ మోసం చేయకుండా, ఎవరి దగ్గరా డబ్బులు దోచుకోకుండా స్వశక్తితో ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను… అన్నారు.

Leave a comment

error: Content is protected !!