ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. టాలీవుడ్ – బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో కావాల్సినంత టైం దొరికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. ఇంట్లోనే యోగా – వర్క్ ఔట్స్ – కుకింగ్ అంటూ రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటున్నారు.

హీరోయిన్లయితే బాడీ ఫిట్ నెస్ కోసం యోగా – జిమ్ అంటూ ఒంటికి పని చెప్తున్నారు. మరికొందరు పనిమనుషులు కూడా రాకపోవడంతో తమ పనులు తామే చేసుకోవాలి అంటూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ – అంట్లు తోముతూ – బట్టలు ఉతుకుతూ వీడియోస్ పెడుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. ఎలాగూ షూటింగ్స్ లేకపోవడంతో ఈ ఖాళీ టైం ని క్రేజ్ పెంచుకోవడం కోసం వాడుకుంటున్నారు మన సెలెబ్రెటీలు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు – చిన్న హీరోయిన్ల నుండి పెద్ద హీరోయిన్ల వరకు..ఒకరేమిటి అందరూ తమ ఫోటోలను వీడియోలను అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!