సంపత్ రాజ్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తోప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో ‘లౌక్యం’లో అతడికి మంచిపాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం’చెక్’. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటిదర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తోఇంటర్వ్యూ… *’చెక్’ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి…* మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేదిచాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్ లోకనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో… అంత దగ్గరగా ఉంటుందీ సినిమా. చాలా చాలా బావుంటుంది. *ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ‘చెక్’ భిన్నమైన సినిమా అనుకోవచ్చా?* అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువలోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడునేను అనుకున్నది ఏంటంటే… నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలుజీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటేఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండాదర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకునమ్మకం ఉంది. *ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ ‘లోకూడా మీరు పోలీస్ గా చేశారు కదా!* ‘భీష్మ’లో నేను పోలీస్ అయినప్పటికీ… అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు. *’చెక్’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?* హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలుకావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆపాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది. *’భీష్మ’, ‘చెక్’ కంటే ముందు కూడా మీరు పోలీస్ రోల్స్ చేశారు. పోలీస్ అంటే సంపత్… సంపత్ అంటే పోలీస్ అన్నట్టు!* (నవ్వుతూ)… ఇప్పుడు ‘ఎఫ్3’లో కూడా పోలీస్ గా చేస్తున్నాను. నేను ఏం చేయాలిఅనుకుంటున్నానంటే… తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. ‘నాకుపెన్షన్ ఇవ్వండి’ అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, ‘పోలీస్కమీషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా’ అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గడ్రస్ నేనే వేసుకుని షూటింగ్ కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు) *దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారి గురించి?* ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరేసినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పదినిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలుకాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభగురించి అందరికీ తెలుసు. *భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్… సక్సెస్ ఫుల్ కాంబినేషన్!* మా కాంబినేషన్ లో ‘లౌక్యం’ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్అవ్వాలి. ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారు నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ నా హోమ్ప్రొడక్షన్ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ గారు ఓ మాటచెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనందప్రసాద్ గారు యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు అని. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్దహిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి. …
దివ్య భారతి అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ హోదా ను దక్కించుకున్న నటి. సిని పరిశ్రమకి వచ్చిన మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి…
యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్…
న్యాచురల్ స్టార్ నాని దర్శకుడు కావాలనే కోరికతో ఫీల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత…
తమిళనాట అందరూ “పురట్చితలైవి” అంటే నగరానికే అమ్మ అని అర్ధం. అలా తనని చెన్నై నగరవాసులు ఆప్యాయంగా అభిమానంతో అమ్మగా పిలుచుకునే జయలలిత జయంతి నేడు. జయలలిత…
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో ఆర్.రత్నవేలు ఒకరు. భారీసినిమాలకు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు తన కెమెరాకన్నుతో ప్రాణం పోసిన బెస్ట్ టెక్నిషియన్ ఆయన.…
“అతిలోక సుందరి” శ్రీదేవి వర్ధంతి నేడు శ్రీదేవి అనగానే తను ‘దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి’ గా గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు…
మధుబాలగా ప్రసిద్ధి చెందిన ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి, (1933 ఫిబ్రవరి 14 – 1969 ఫిబ్రవరి 23) ఒక ప్రసిద్ధ హిందీ చిత్ర నటి. ఆమె…
డైరెక్టర్ తేజ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించారు. అయితే, ఆయన దర్శకునిగా పరిచయమైన ‘చిత్రం’ ఆయన కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తేజ…
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని…