వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ .. ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా సినిమా తీసి చరిత్ర సృష్టించాడు. సినిమా పేరు ‘కరోనా వైరస్’. తన కుటుంబ సభ్యులు ఒకొక్కరికీ కరోనా వైరస్ వ్యాపిస్తుంటే.. ఆ ఇంటి యజమాని పడే మానసిక వేదనే ఈ సినిమా కథాంశం. తనకున్న కొద్ది పాటి వనరుల్నే ఉపయోగించుకొని జస్ట్ ఒక ఇంటిలోనే తనదైన స్టైల్లో సినిమా తెరకెక్కించాడు వర్మ. ప్రతీ రోజూ పండగే చిత్రంలో సత్యరాజ్ రెండో కొడుకుగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఐదుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఒక ఫ్లాట్ లోనే సినిమా మొత్తం సాగుతుంది. ప్రపంచంలోనే కరోనా వైరస్ మీద తెరకెక్కించిన మొట్టమొదటి సినిమాగా వర్మ ‘కరోనా వైరస్’ నిలిచిపోవడం విశేషం.
ఓ కుటుంబంలో తన కూతురికి కరోనా లక్షణాలు వచ్చినా ఆ తండ్రి అదేం లేదంటూనే కవర్ చేస్తాడు. టెస్టులు చేపిద్దాం నాన్న అని కుమారుడు అన్నా.. మనం నీట్ గా ఉన్నాం అది కరోనా కాదు.. వేడి నీళ్లతో కాపుడం పెట్టమంటాడు. చివరకు ఆ దగ్గు దగ్గీ దగ్గీ ఇంట్లోని ముసాలవిడకు అంటడం.. ఆమెకు లక్షణాలు బయటపడడం.. తండ్రి కోపంలో కాల్పులు జరిపిన శబ్ధం వినిపించింది. వైద్యులు వచ్చి వారికి టెస్టులు చేసి కరోనాగా నిర్ధారించడం.. ఇది అంతిమంగా వర్మ లాక్డౌన్ లో అల్లిన ‘కరోనా వైరస్’ మూవీ ట్రైలర్ సారాంశం. టోటల్ గా కరోనా వైరస్ ట్రైలర్ పర్వాలేదనిపించుకుంది.
ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?time_continue=242&v=D3EdI6G2tF4&feature=emb_logo