చిత్రం: కెప్టెన్
నటి నటులు: ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, ఆదిత్యా మీనన్ తదితరులు
సంగీతం: డి ఇమ్మాన్
ఛాయాగ్రహణం: ఎస్ యువ
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ
నిర్మాత: ఎస్ ఎన్ ఎస్ మూవీ ప్రొడక్షన్ & షో పీపుల్
రచన, దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 08, 2022

ఈ మధ్య కాలంలో ట్రైలర్ తో సౌత్ ఇండియా ప్రేక్షకులని ఆసక్తి రేపిన చిత్రం “కెప్టెన్”. రాజా రాణి, వాడు వీడు, నేనే అంబాని, సార్‌ప‌ట్ట‌ వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా హీరో ఆర్య నటించగా, దర్శకుడు శక్తి సౌందరాజన్ తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ తరహాలో బజ్ క్రియేట్ అయ్యి, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ద్వారా తెలుగు లో థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ: విజయ్ కుమార్(ఆర్య) ఒక అనాథ అలాగే ఇండియన్ ఆర్మీ లో కెప్టెన్. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు(నార్త్ ఈస్ట్ బోర్డర్)లో ఒక మిషన్ కోసం సెక్టార్ 42కి గ్రూప్ లు వారీగా ఆర్మీ వెళ్తే తిరిగి ప్రాణాలతో ఎవ్వరు రాకపోవడంతో, విజయ్ అండ్ టీమ్ ని సెక్టార్ 42కి పంపిస్తారు. తన టీం లో హరీష్ ఉత్తమన్ ఎవ్వరికి అంతుపట్టని విధంగా తనకు తానే షూట్ చేసుకుని మరణించడంతో టీం వెనకడుగు వేస్తారు. మరల వన్ ఇయర్ తరువాత సైంటిస్ట్ కీర్తి (సిమ్రాన్) మళ్ళీ విజయ్ టీం ని సెక్టార్ 42కి తీసుకెళ్తుంది. ఆ ఏరియాలో వింత జీవులు / క్రియేచర్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు చనిపోవడానికి అవే కారణం అని తెలుసుకుంటాడు. మరి విజయ్ ఆ వింత జీవులని ఎదుర్కొని ఎలా ఆపగలిగాడు అనేదే కథ?

కధనం,విశ్లేషణ: తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్నికోరుకుంటూ ఉంటారు. హీరో ఆర్య కథలో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ప్రేక్షకులకి వినూత్నమైన కథలని అందించడంలో తనకు తానే సాటి అని చెప్పచ్చు. ఈ కెప్టెన్ సినిమా కూడ ఒక వినుత్నమైనా కథ కి చెందిందే. ఇండియన్ ఆర్మీ వింత జీవులని అంతం చేయడానికి హీరో చేసే సాహసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. మన ఇండియన్స్ తరుచుగా వింత జీవులు సినిమాలు హాలివూడ్ లో చూస్తుంటాం. ఇలాంటి సినిమాలు మన వాళ్ళు కూడ తీయగలుగుతున్నారు అని గర్వంగా ఉంది. మ్యాన్ వర్సెస్ క్రియేచర్ కాన్సెప్ట్‌లో తీసిన ఫస్ట్ సినిమా ‘కెప్టెన్’ కావడంతో ప్రేక్షకులకి ఆసక్తి పెరిగింది.

హీరో ఆర్య తన బృందంతో కలిసి సినిమా ఓపినింగ్ లో చేసే యుద్ధ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఆ యుద్ధ సన్నివేశాలలో బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ లో, హీరో ఆర్య శత్రువు ని అంత మొందించే స్టెజస్ చెప్తుంటే గూసుబంప్స్ వస్తాయి. ఆ తరువాత తన టీం తో సాగే ఫ్రెండ్షిప్ సాంగ్ చాలా చక్కగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి బాండింగ్ ఉన్న తన టీం లో హరీష్ ఉత్తమన్ చనిపోవడం టీం అందరు కుంగిపోతారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి క్యారెక్టర్ ట్విస్ట్ పెద్దగా ఏమి ఉండదు. అక్కడక్కడా రొటీన్ గా సాగే సీన్స్ ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ తో ప్రేక్షకుల ని అలరిస్తుంది.

‘కెప్టెన్’ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ‘ప్రిడేటర్’లా గుర్తొస్తుంటుంది. సినిమా చూశాక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కథ మీద ఇంకా శ్రద్ద పెట్టాలిసింది. సినిమా లో ఎక్కడ ల్యాగ్ అనిపించకపోయిన క్రియేచర్ తో సాగే సన్నివేశాలు సిజి వర్క్ ఇంకా బాగా వర్కౌట్ చేయాలిసింది. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చెప్పిన దర్శకుడు. వాళ్ళ కోసం వెళ్లిన సైనికులకు ఏమీ కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం కూడా అర్థం కాదు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. హీరో విషయంలో మాత్రం ఆ లాజిక్ ఫాలో అవ్వడం అభినందించాలి.

క్రియేచర్ తో హీరో చేసే యుద్ధ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేనప్పటికీ ఇంటర్వెల్, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా పర్వాలేదనిపించారు. సైంటిస్ట్‌గా చేసిన సిమ్రాన్ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది. మ్యూజిక్ పరంగా డి ఇమాన్ ఆకట్టుకుంటారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే పాట కూడా మంచి మెలోడీ అని చెప్పచ్చు.

నటి నటులు పెర్ఫామెన్స్: హీరో ఆర్య ఆర్మీ డ్రెస్ లో కేక పుట్టించాడు. తనదైనా స్టైల్ లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ బాగా చేశారు. బహుశా ఇంకా కథ బాగుండి ఉంటె, ఇంకా ఎక్కువ యాక్టింగ్ కి స్కోప్ ఉండి ఉండచ్చు. ఐశ్వర్య లక్ష్మీది అతిథి పాత్ర గా మెరిసింది. ఇకపోతే ఫ్రెండ్స్ గా నటించిన ఆదిత్యా మీనన్, హరీష్ ఉత్తమన్ పాత్రల నిడివి అంత అంత మాత్రమే. ఇక, సిమ్రాన్ సినిమా లో ఆకర్షణ గా నిలిచినా దర్శకుడు సరిగ్గా క్యారెక్టర్ డిజైన్ చేసుకోలేదని చెప్పాలి.

సాంకేతిక వర్గం: శక్తి సౌందర్ రాజన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త నిరాశ అనిపించినప్పటికీ బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంకాస్త, స్టోరీ మీద గ్రిప్ తీసుకొచ్చి కొత్త రకం సన్నివేశాలు పెట్టినట్టయితే సినిమా వండర్స్ క్రియేట్ చేసి ఉండేది. డి ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా కి హీరో అని చెప్పాలి. ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ పని తీరు సూపర్బ్. ఎస్ యువ కెమెరా వర్క్ అక్కడక్కడ తేలిపొయ్యిన పర్వాలేదు అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ అని చెప్పాలి.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్: ఎమోషనల్ గా సాగిన “కెప్టెన్”

Review By: Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!