టైటిల్‌: కెప్టెన్‌ మిల్లర్‌
నటీనటులు: ధనుష్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌, నివేదిత తనీష్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
సంగీతం: జీవి ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ నూని
ఎడిటర్‌: నాగూరన్‌
విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో)

తమిళ్ స్టార్ హీరో ధనుష్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా తెలుగు వెర్షన్‌లో రిలీజైన మూవీ కెప్టెన్‌ మిల్లర్‌. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. మరి కెప్టెన్ మిల్లర్ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ. తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో అగ్ని ( ధనుష్‌) కుల వివక్షకు గురవుతాడు. అక్కడి రాజు (జయప్రకాశ్‌) తక్కువ కులం వారిని గుడిలోనికి రానివ్వరు. ఆ వివక్షతో కోపం పెంచుకున్న అగ్ని బ్రిటీష్‌ సైన్యంలో చేరతాడు. వారు అగ్నికి మిల్లర్‌ అనే పేరు పెట్టి డ్యూటీలోకి పంపుతారు. ట్రైనింగ్ అయి డ్యూటీలో జాయిన అయిన మిల్లర్.. తన పై అధికారిని చంపేస్తాడు. అక్కడి నుంచి మిల్లర్‌ పారిపోవడానికి రఫీక్ (సందీప్‌ కిషన్‌) సాయపడతాడు. మిల్లర్ రాజన్న (ఎలగో కుమారవేల్‌) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ .. వచ్చిన డబ్బు నుంచి కొంత భాగాన్ని స్వాతంత్ర్యపోరాటం చేసే సంఘాలకు పంపిస్తుంటాడు. అయితే తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన ఓ నిధి ని బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ నిధిని మిల్లర్ దొంగిలిస్తాడు. అక్కడి నుంచి బ్రిటీష్ వారి దాడులను మిల్లర్‌ ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథాంశం.

కథనం :

1930 ల కాలం నాటి స్వాతంత్ర్య పోరాటపు బ్యాక్‌ డ్రాప్‌తో చాలా సినిమాలొచ్చాయి. అలాగే కుల వివక్ష కథాంశంతో కూడా చాలా సినిమాలొచ‌్చాయి. అగ్రవర్ణాల ఆధిపత్యం, నిమ్న వర్ణాల పోరాటంతో ఎన్నో కథలు చూసాం. వీటన్నింటినీ కెప్టెన్ మిల్లర్‌ సినిమాలో చూస్తాం. ఓ యువకుడి జీవితాన్ని డిఫరెంట్‌ పార్ట్స్‌గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌. స్వాతంత్ర్య పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్‌.

హీరో ఎంట్రీ నుంచి బ్రిటీష్‌ సైన్యంలో చేరే వరకు బలమైన నేపథ్యాన్ని సీన్స్‌ని రాసుకున్నాడు , ప్రజెంట్ చేసాడు దర్శకుడు. అయితే బ్రిటీష్‌ వారికి ఎదురు తిరిగి బయటకొచ్చి పోరాడే సన్నివేశాలు మాత్రం తేలిపోయాయి. కుల వివక్ష కారణంగా బ్రిటీష్ వారికి చేరువై.. అక్కడి నుంచి బయటకొచ్చి మిల్లర్‌ చేసే పోరాటం చాలా వరకు ఆడియెన్స్‌కు అర్ధం కావు. పిరియాడిక్‌ ఫిల్మ్స్‌లో స్టైలిష్ గాగుల్స్‌, బైక్ రైడింగ్స్‌ చూడటానికి బావున్నా.. కథకు సింక్‌ కావు.

ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్‌ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్‌ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్‌ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కూడా ఆకట్టుకుంటుంది.అయితే ఎడతెరపి లేని యాక్షన్‌ ఘట్టాలతో వయెలెన్స్ నింపేసాడు దర్శకుడు.

ఆర్టిస్ట్స్‌ :

ఈ చిత్రానికి వన్‌ మ్యాన్‌ ఆర్మీ ధనుష్. అగ్ని, మిల్లర్ ఈ రెండు షేడ్స్‌ను ధనుష్‌ అద్భుతంగా నటించాడు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. శివన్న గా శివరాజ్‌కుమార్‌ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు. రఫీక్ పాత్రలో సందీప్‌ పాత్ర గుర్తిండిపోతుంది. మిగతా పాత్రలు పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నిషియన్స్‌ :

టెక్నికల్‌ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్‌ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్‌ సీన్స్‌ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Leave a comment

error: Content is protected !!