తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ జనవరి 26న తెలుగులో విడుదల కానుంది. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ‘కెప్టెన్ మిల్లర్’ విశేషాలని పంచుకున్నారు.

– కెప్టెన్ మిల్లర్ గురించిన ఆలోచన 10 సంవత్సరాల క్రితం వచ్చింది. బ్రిటీష్ ఆర్మీలో భారతీయ సైనికుడిపై సినిమా తీయాలనేది ఆ ఆలోచన. స్క్రిప్ట్‌పై పని చేయడం ప్రారంభించాను. అలా కెప్టన్ మిల్లర్ ప్రారంభమైందన్నారు.

స్క్రిప్ట్‌ని పూర్తి చేసిన తర్వాత, కెప్టెన్ మిల్లర్ పాత్రకు న్యాయం చేయడానికి ధనుష్ సరిగ్గా సరిపోతారని భావించాను. అతనిని సంప్రదించాము. ధనుష్ గారికి కథ చాలా నచ్చింది. కెప్టన్ మిల్లర్ గా అద్భుతమైన నటన కనపరిచారన్నారు.

ధనుష్ అద్భుతమైన నటుడు, సూపర్ స్టార్. అతను ఎలాంటి పాత్రనైనా చేయగలడు. అతనితో పని చేయడం అద్భుతమైన అనుభవం, ఈ జర్నీలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అతని నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.ఇది చాలా ఎమోషనల్ కథ, చిత్రంలో 40% మాత్రమే యాక్షన్ ఉంది. మిగిలినది పాత్ర యొక్క ప్రయాణం గురించి ప్యూర్ డ్రామా. ప్రేక్షకులు పాత్రలకు, కథకు చాలా బాగా రిలేట్ అవుతారు.ప్రేక్షకులు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లని చూడబోతున్నారు, ప్రతి ఒక్కరూ తమ పాత్రలలో ఒదిగిపోయారు. – కెప్టెన్ మిల్లర్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించిన కథ. సినిమా ఇతివృత్తం చాలా యూనివర్సల్‌గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.

Leave a comment

error: Content is protected !!