Indian 2 : కమల్ హాసన్, శంకర్ అద్భుత కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌లపై సుభాస్కరన్ నిర్మించారు. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.

28 సంవత్సరాల క్రితం ‘భారతీయుడు’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ జోడీ మరోసారి ‘భారతీయుడు 2’తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం మరో ఆకర్షణీయమైన పాట ‘క్యాలెండర్’ విడుదలైంది.

ఈ పాటలో ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో నటించడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో ఈ పాటను చిత్రీకరించారు. ప్రతి సన్నివేశం గ్లామర్‌గా, అద్భుతంగా ఉండేలా చూసుకున్నారు. ఈ పాటను వెండితెరపై చూస్తే మరింత ఆనందంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ‘భారతీయుడు 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!