తెలుగులో అతి చిన్న చిత్రంగా విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు.. విమర్శకుల ప్రశంసల్ని సైతం పొందిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తమిళ, మలయాళంలో కూడా  రీమేక్ అయింది. శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ పతాకంపై ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌  కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంబర్‌ జాస్తీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రీసెంట్ గా విడుదలైన  కేరాఫ్ కాదల్ చిత్రం ట్రైలర్ తెలుగు వెర్షన్ లాగానే అందరినీ ఆకట్టుకుంటోంది.

 తెలుగు ట్రైలర్ ను ఎలా కట్ చేశారో , అచ్చంగా తమిళ ట్రైలర్ ను కూడా అవే షాట్స్ తో కట్ చేయడం విశేషం. ఇక  ఇందులో  దీపం, , ముంతాజ్, సోర్కర్, ఆర్య, కార్తిక్ రత్నం.. తదితరులు నటిస్తోన్న కేరాఫ్ కాదల్ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 20న  విడుదల కానున్న ‘కేరాఫ్ కాదల్ ’చిత్రం కోలీవుడ్ లో  కేరాఫ్ కంచరపాలెం చిత్రం లాగానే అలరిస్తుందేమో చూడాలి.

ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి. 

https://www.youtube.com/watch?v=hIVx795azKI&feature=youtu.be&fbclid=IwAR3yinCzPGLcpE-tFJyEvO_2Lr3khx-RJXwzmJXc9OcatcW3j0i7EWt8VKw

 

Leave a comment

error: Content is protected !!