యంగ్ డైరెక్టర్  మారుతికి ఎప్పటి నుంచో అల్లు అర్జున్తో సినిమా చేయాలని ఆశ.  అలాగే.. మారుతితో సినిమా చేయడానికి బన్నీ కూడా ఉత్సాహంగా ఉన్నాడు . కానీ మంచి కథ రెడీ అయ్యేవరకూ .. బన్నీ దగ్గరికి వెళ్లకూడదని ఫిక్సయ్యాడట మారుతి. అందుకే ఇంతకాలం ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఓ మంచి కథను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసాడట. ఇక ఈసారి ఆలస్యం చేయకుండా ఇటీవలే బన్నీకి ఆ కథ లైన్ వినిపించేశాడట మారుతి. బన్నీకి కూడా మారుతీ చెప్పిన లైన్ నచ్చి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత ఐకాన్ సినిమాతో బిజీగా అవుతాడని తెలిసింది. ఇవేగాక ఇంకా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట.

ఆ ప్రాజెక్టుల మధ్య ఏమైనా గ్యాప్ వస్తే మారుతి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది . మారుతి కూడా ఏమాత్రం తొందర పడడం లేదు. బన్నీ ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు సిద్ధం అని అంటున్నాడు. ఈ గ్యాప్ లో మారుతీ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చినట్టు సమాచారం. మారుతి స్పెషాలిటీ ఏంటంటే.. సినిమాను క్వాలిటీతో తక్కువ టైంలో పూర్తి చేయగలడు. అందుకే మారుతి కూల్ గా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడట. ఇక ఈ మధ్య హీరో రామ్ తో మారుతి సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ మారుతి స్పందించి అవేవి నిజం కాదని తేల్చేసాడు. ప్రస్తుతం ఓ యంగ్ హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో మారుతి ఉన్నట్లు సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!