పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ‘ బ్రో ‘ సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు క్యారెక్టర్‌ చేసిన శ్రీనివాస్‌.. మెయిన్‌ లీడ్ చేస్తున్న మూవీ గురువారం నాడు లండన్‌లో ప్రారంభమైంది. ఏ స్టార్‌ ప్రొడక్షన్స్, ఏబి ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్, అనిక ప్రొడక్షన్‌లు సంయుక్తంగా ఈ ‘దీన్‌ తననా’ చిత్రాన్ని హుస్సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌ని మెయిన్‌లీడ్ శ్రీనివాస్, కమెడియన్ ఆలీలపై చిత్రీకరించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతుంది. దాదాపు 10 రోజుల పాటు లండన్‌ లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగొస్తున్నట్టు చెప్తున్నారు మేకర్స్‌. మిగతా యూనిట్‌, ఆర్టిస్టుల డిటేల్స్‌ త్వరలో అనౌన్స్‌ చేయనున్నారు.

Leave a comment

error: Content is protected !!