మాస్ పల్స్ మహబాగా తెలిసిన దర్శకుడు ఆయన. హీరోలకు హై ఓల్టేజ్ కేరక్టరైజేషన్ క్రియేట్ చేయడంలోనూ.. కళ్ళు చెదిరే యాక్షన్ సిక్వెన్సెస్ ను డిజైన్ చేయడంలోనూ ఆయన మాస్టర్. ఆవేశం ఆయన హీరోల ఆయుధం. ధైర్యం, సాహసం, అగ్రెసివ్ నెస్, నిర్లక్ష్యం..  తలపొగరు అదనపు అర్హతలు. ఈ లక్షణాలతోనే ఆయన హీరోలు మాస్ జనానికి పూనకాలు తెప్పించేస్తారు. ఆ దర్శకుడు పేరు బోయపాటి శ్రీను. మాస్ ఇమేజ్ కోసం ఆరాట పడే హీరోలంతా.. బోయపాటి దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమాలో నటించినా చాలని ఉబలాట పడుతుంటారు.  మరి ఆయన రాసుకొనే కథలు, తీసే సన్నివేశాలు .. సంధించే డైలాగ్స్ .. అంతా మాస్ మయం.

సరిగ్గా 15 ఏళ్ళ క్రితం ఇదే టైమ్ కు ‘భద్రా’ చిత్రంతో బోయపాటి టాలీవుడ్ లో దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు. రవితేజ కెరీర్ లోనే భద్రా బిగ్గెస్ట్ హిట్టైంది. ఆ తర్వాత వెంకీ తో తులసి తెరకెక్కించి .. వరుసగా రెండోసారి ఘన విజయం అందుకున్నారు. అయితే మాస్ దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరును మారుమోగేలా చేసిన చిత్రం బాలయ్య తో తీసిన ‘సింహా’ చిత్రంతోనే. పవర్ ఫుల్ డ్యూయల్ రోల్స్ తో బాలకృష్ణ ను ప్రజెంట్ చేసిన తీరుకు బోయపాటి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత దమ్ము, లెజెండ్ , సరైనోడు , జయజానకి నాయక, వినయ విధేయ రామ చిత్రాలతో బోయపాటి సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం బాలయ్యతో తన మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తూ .. హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. మాస్ ప్రేక్షకుల్ని యాక్షన్ చిత్రాలతోనే ఆకట్టుకోవచ్చనే సక్సెస్ ఫార్ములా తెలిసిన బోయపాటి.. అదే సూత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ లో దర్శకుడిగా దూసుకుపోతున్నారు. బోయపాటి దర్శకుడిగా 15 ఏళ్ళు పూర్తి సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!