Bollywood : బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతురాలైన నటీమణి భూమి పెడ్నేకర్‌. తన వైవిధ్యమైన పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆమె ‘దల్దాల్‌’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకోవడంతో, అభిమానుల్లో మరింతగా ఆసక్తి నెలకొంది.

వరుస హత్యలు చేస్తున్న ఒక సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునేందుకు ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ సిరీస్‌ కథ తిరుగుతుంది. భూమి పెడ్నేకర్‌ ఈ సిరీస్‌లో డీసీపీ రీటా ఫెరీరా అనే పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా భూమి పెడ్నేకర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పాత్ర తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రల్లో ఒకటి అని, ఇలాంటి భిన్నమైన ప్రాజెక్టులో అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!