కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తుండగా.. కేంద్రప్రభుత్వం సుదీర్ఘమైన లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 21 రోజుల పాటు ఎవరి ఇంట్లో వారిని సురక్షితంగా ఉండమని చెబుతూ.. దేశ ప్రజల్ని ఇళ్ళకే పరిమితం చేశారు. అయితే ఈ ప్రాసెస్ సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. రెక్కాడితే గానీ, డొక్కాడని ఎందరో రోజు కూలీలకు అశనిపాతంగా మారింది. అలాంటి వారి కోసం బాలీవుడ్ ప్రముఖులు ఐ స్టాండ్ విత్ హ్యుమానిటీ అంటూ ప్రతిజ్ఞ చేశారు.

బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహాన్.. ఆయుష్మాన్ కురానా.. తాప్సిలతో పాటు ఇంకా పలువురు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల సాయంకు ముందుకు వచ్చారు. వారికి 10 రోజులకు సరిపడ ఆహారపు పదార్థాలను అందించేందుకు సిద్దం అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ అసోషియేషన్ ద్వారా ఈ సాయంను చేసేందుకు ముందుకు వచ్చారు.సినీ ప్రముఖులు ఇంకా టీవీ రంగానికి చెందిన వారు ఇందుకోసం విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఐ స్టాండ్ విత్ హ్యూమానిటీ అంటూ తారలు ముందుకు రావాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Leave a comment

error: Content is protected !!