Kakuda : బాలీవుడ్ సరికొత్త హారర్ చిత్రం ‘కాకుద’ చిత్రం మనల్ని ఒక భయంకరమైన ఊరికి తీసుకెళ్తుంది. ఈ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలు ఉంటాయి – ఒక పెద్దది, మరొకటి చిన్నది. ప్రతి మంగళవారం, దెయ్యం రాకపోకల కోసం చిన్న గుమ్మాన్ని తెరిచి ఉంచాలి. కానీ, పొరపాటున, కొత్తగా పెళ్ళైన ఒక జంట చిన్న గుమ్మాన్ని మూసేస్తుంది.

ఈ ప్రశ్నకు సమాధానం ‘కాకుద’ చిత్రంలోనే దొరుకుతుంది. ట్రైలర్లో చూపించిన ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఈ చిత్రం ఎంత భయంకరంగా ఉండబోతోందో తెలియజేస్తాయి. సోనాక్షి సిన్హా, రితేశ్‌ దేశ్‌ముఖ్, షకీబ్‌ సలీమ్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ముంజ్యా’ దర్శకుడు ఆదిత్య సర్పోత్‌దార్‌ ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సోనాక్షి, షకీబ్‌లు దెయ్యంతో ఇబ్బంది పడే కొత్త జంటగా కనిపిస్తారు. దెయ్యాన్ని వెంటాడి బంధించడానికి వచ్చే మాంత్రికుడి పాత్రలో రితేశ్‌ నటించారు. ఈ చిత్రం జులై 5న విడుదలవుతోంది.

Leave a comment

error: Content is protected !!