Toxic movie : కన్నడ యంగ్ స్టార్ యశ్ కెజీఎప్ సిరీస్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రాన్ని ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఈ విషయాన్ని అక్షయ్ ఒబెరాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. మూవీ యూనిట్ తనకు పంపిన ఆహ్వాన లేఖను కూడా అతను షేర్ చేశారు.

‘టాక్సిక్’ చిత్రం ప్రకటించినప్పటి నుండి నటీనటుల వివరాలు వెల్లడించలేదు. అక్షయ్ ఒబెరాయ్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలియడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ ఏడాది ‘ఫైటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ ఒబెరాయ్, ‘టాక్సిక్’ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.

యశ్ నటిస్తున్న 19వ చిత్రం అయిన ‘టాక్సిక్’ కు ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఉపశీర్షిక ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!