బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ “కాబిల్” చిత్రంలో అద్భుత నటనతో అందరి మనసు దోచారు. అంధుడి పాత్రలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అదే ధైర్యం చేశాడు. అతనే సైఫ్ అలీఖాన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్ చిత్రంలో సైఫ్ అంధుడి పాత్రలో నటించనున్నాడు. ఈ పాత్రను బాలీవుడ్ లోని మరొకరికి ఆఫర్ చేసినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సైఫ్ ఈ పాత్రకు ఒప్పుకున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథాంశం ఖరారు అయింది. ఈ పాత్రతో సైఫ్ కి మరింత గుర్తింపు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సైఫ్ “దేవర” చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అంతకుముందు “ఆదిపురుష్” లో రావణుడి పాత్రలో నటించాడు. హీరోగా, విలన్ గా, చిన్న పాత్రలు అంటూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సైఫ్. ఈ అంధుడి పాత్రతో మరింత ప్రత్యేకంగా నిలబడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తెలుగులో కూడా మాస్ రాజా రవితేజ “రాజా ది గ్రేట్” చిత్రంలో అంధుడి పాత్రలో నటించి మెప్పించాడు.

Leave a comment

error: Content is protected !!