సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రచయిత బి.కె. ఈశ్వర్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గురువారం జూబ్లీ హిల్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
నిబద్ధత, అంకిత భావం, జిజ్ఞాస, ప్రలోభాలకు లొంగని నైజం – ఇవన్నీ కథా రచనలో చేయి తిరిగిన రచయితగా పేరు తెచ్చుకున్న ఈశ్వర్ ని అనతికాలంలోనే జర్నలిజంలోనూ సిద్ధహస్తుడిని చేశాయి. బి కె ఈశ్వర్ నుండి ఆయన పేరు ‘విజయచిత్ర ఈశ్వర్’ గా మారేంతగా, భావ సారూప్యం ఉన్న వ్యక్తులు లభిస్తే పత్రిక నాణ్యతాప్రమాణాలతో మరింతగా రాణిస్తుందనదానికి ఉదాహరణ ఈశ్వర్. కాలక్రమంలో రచయితగా, జర్నలిస్ట్ గా ఆయన మరింతగా ఎదిగారు.1997లో, ఆయన గడచిన కాలం అనువాద రచనకు సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని గెలుచుకున్నాడు. ఈయన స్వస్థలం విజయవాడ. కథా రచన తో ప్రారంభించి, విజయచిత్ర సినిమా పత్రిక తో ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారి, యాభై ఏళ్లకు పైగా జర్నలిజం తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ, సినిమా, టి.విలకు స్క్రిప్ట్ రచయితగా , గీత రచయిత గా కూడ కృషి చేసారు. యూట్యూబ్ చానల్స్ ద్వారా కూడ ఈయన చాల మందికి సుపరిచితులు.