సుజాత మోహన్ భారతీయ సినీ నేపధ్య గాయిని. ఆమె స్వరం యువ హృదయాలను ‘పరువపు వానలో పరువశింప’ చేస్తుంది. ‘సారి సారి అంటుందోయ్ కుమారి’ అంటూ అల్లరి చేస్తుంది. ‘అందాల ఆడబొమ్మ’ అంటూ ప్రేమికుడికి ప్రేయసిని గుర్తుకు తెస్తుంది. ‘నా (ప్రతి) ఇంటి ముందున్న పూదోటను’ పలకరిస్తుంది ఆమె పాట. ఆ స్వరం ‘అతిశయం’ తో పాడితే ‘ఉరుములు (నీ) మువ్వలై మెరుపులు (నీ) నవ్వులై’ వానలో తడిసే జంటలకు ‘వాన వల్లప్ప వల్లప్ప’ అంటూ పాడుతూ ‘కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ’ అంటూ కవ్వించే ప్రేయసికి ‘చిగురాకు చాటు చిలుకను’ పరిచయం చేస్తుంది. అలా ఆమె స్వర మాధ్యుర్యమైన పాటలు వింటూ ఉంటే ‘కొంత కాలం కొంత కాలం కాలం ఆగిపోవాలి’ అనిపిస్తుంది. ఈ రోజు ఆ మాధుర్య గాయని సుజాత మోహన్ 58వ పుట్టినరోజు. 

ఆమె 6వ తరగతి చదివే సమయంలోనే కన్నెళుతీ పొట్టుతట్టు అనే సినిమా పాట పాడింది. సుజాత తన 17వ ఏట… చదువుకొనసాగిస్తూనే కె.జె.ఏసుదాసు వంటి గాయకులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజిలపై షోలు చేసింది.

1975లో విడుదలైన మలయాళ సినిమా టూరిస్ట్ బంగ్లాలోని ఈ పాటకు ఎం.కె. అర్జునన్ సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు శ్యాం చేసిన కామం క్రోధం మోహం, సలీల్ చౌదరీ స్వరపరిచిన అపరాధీ సినిమాల్లోని పాటలు పాడింది ఆమె. ఆ సమయంలోనే ఎం.జి.రాధాకృష్ణన్ ఎన్నో పాటలు పాడించాడు సుజాత చేత. అవన్నీ సినిమాలకు చెందని పాటలే. వాటిలో ఒడక్కుళల్ విలి అనే ఆల్బం అతి పెద్ద హిట్ అయింది.
ఆమె ఎక్కువగా మలయాళం, కన్న,డ తమిళ సినిమాల్లో పాటలు పాడింది. ఆమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో మంచి గాయినిగా గుర్తింపు పొందింది. ఆమె కుమార్తె శ్వేత మోహన్ కూడా గాయిని కావడం విశేషం.

ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని బర్త్ డే విషెస్ చెప్తూ… ఆమె పాడిన టాప్ సాంగ్స్ మీకోసం

Leave a comment

error: Content is protected !!