అతడి వయసు 44ఏళ్ళు. సినిమా వయసు 15 ఏళ్లు. 29 ఏళ్ళ ప్రాయంలోనే ఒక సినిమాకి సంగీతం అదించేంతటి మేథాశక్తిని కలిగిన సంగీత విద్వాంసుడు అయిపోయాడు. ఇటు శాస్త్రీయ సంగీతంలోనూ , అటు వెస్ట్రన్ బీట్ లోనూ సాటిలేని మేటి సంగీతకారుడు అనిపించుకున్నాడు. శ్రోతలు మెచ్చే క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో మాస్టర్ అయిపోయాడు. అతడి పేరు గోపీ సుందర్. మలయాళీలు ముద్దుగా అతడ్ని గోపేట్టా అని పిలుచుకుంటారు. అతడు సంగీత దర్శకుడే కాదు,.. గాయకుడు, ప్రోగ్రామర్, లిరిక్స్ రైటర్, పెర్ఫార్మర్ , నటుడు కూడా.

గోపీ సుందర్ కెరీర్ టీవీ కమర్షియల్స్ తో స్టార్ట్ అయింది.  దాదాపు 50వేల జింగిల్స్ కంపోజ్ చేసిన ఘనత అతడిది. చాలా మంది సినీ సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్ గానూ, కంపోజర్ గానూ పని చేసిన అనుభవం ఎంతగానో ఉంది. ఆ క్రెడిట్ తోనే అతడు .. 2006లో ‘నోట్ బుక్’ అనే మూవీతో సంగీత దర్శకుడిగా మాలీవుడ్ లోకి ప్రవేశించాడు. తొలి చిత్రంతోనే వెరైటీ ట్యూన్స్ ఇచ్చి.. కుర్రకారును ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా చిత్రాలకు అతడి సంగీతం ప్రాణం పోసింది. ఇప్పటివరుకూ దాదాపుగా 160 పైచిలుకు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు గోపీసుందర్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రంతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన గోపీ సుందర్.. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్,  గీత గోవిందం, నిన్నుకోరి, ఏబీసీడీ,మజ్ను, ప్రేమమ్, పంతం  లాంటి చిత్రాలకు సుందర సంగీతం అందించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  నేడు గోపీ సుందర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!