కలకత్తా నగరంలో గమ్యం తెలియని బాటసారి ‘యమహానగారి కలకత్తా పురి’ అని ఆలపించినా… ‘ఓం నమామి’ వింటూ ప్రేమికులు పరవశించినా… ‘హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో’ అంటూ చెలి కౌలిగిలో వెచ్చదనాన్ని ఆస్వాదించినా… ఏకాంతంగా ఉన్న సమయాన ‘కన్నుల్లో నీ రూపమే’ అంటూ ప్రేయసి ధ్యాసలో ప్రేమికుడు ఆలపించినా… ‘నీలి నింగిలో నిండు జాబిలీ’ లాంటి ప్రేయసి ‘జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి’ అంటూ చిలిపితనం చూపించిన… ‘రోజావే చిన్ని రోజావే’ నుండి నిన్న్నటి ‘మీమీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ వరకు శ్రోతలకు తన గాత్రం ద్వారా ఎన్నో మధురమైన పాటలను ఆలపించిన గాయకుడు హరిహరణ్ పుట్టినరోజు నేడు.

హరిహరణ్ ప్రముఖ భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు సినిమాలలో ఎన్నో పాటలను ఆలపించారు. గజల్ లోను ప్రావీణ్యం ఉన్న గాయకుడు.

Hari haran family with R D Burman

హరిహరణ్ కేరళ లోని తిరువనంతపురంలో ఏప్రిల్‌ 3న 1955 సం”లో ఓ తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి అలమేలు, అనంత సుబ్రహ్మణ్య అయ్యర్లు. వీళ్ళు ప్రముఖ కర్ణాటక శాస్ర్తీయ సంగీతకారులు. హరిహరణ్ ముంబయిలో పెరిగాడు. ముంబయిలోని ఐ.ఐ.ఇ.ఎస్‌ కళాశాలలో సైన్స్‌, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పూర్తిచేశాడు. ఆయనకు సంగీత విద్య వారసత్వంగా లభించింది. హరిహరణ్ తల్లి అలమేలు ఆయనకు తొలి గురువు. చిన్నతనంలోనే కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆయన హిందూస్తానీ సంగీతంలో కూడా శిక్షణపొందాడు. ఆయన హిందూస్థానీ సంగీతం కూడా బాల్యంలో నేర్చుకున్నారు. కౌమరదశలో ఆయన “మెహ్దీ హసన్”, “జగ్జీత్ సింగ్” వంటి గాయకులకు ప్రభావితుడై గజల్ సంగీతాన్ని అభివృద్ధి పరచుకున్నారు. ఆయన “ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్” వద్ద హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయన ప్రతిరోజూ 13 గంటలకు పైగా సంగీత సాధన చేస్తుంటారు.

హరిహరణ్ కెరీర్ ప్రారంభంలో టెలివిజన్లో ప్రదర్శనలిచ్చేవారు. అనేక టెలివిజన్ సీరియళ్ళకు పాటలు కూడా పాడారు. 1977 లో ఆయనకు “ఆల్ ఇండియా సర్ సింగర్ కాంఫిటీషన్”లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978 లో “జైదేవ్” దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం “గమన్”లో పాడుటకు ఒప్పందం చేసుకున్నారు. ఆయన పాడిన “అజీబ్ సా నహ ముఝ్ పార్ గుజర్ గయ యారో” పాటకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్‌ అవార్డు లభించింది. అదే విధంగా జాతీయ అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది.

తన కెరీర్ ప్రారంభంలో హరిహరన్ టెలివిజన్లో ప్రదర్శనలిచ్చేవాడు. అనేక టెలివిజన్ సీరియళ్ళకు పాటలు పాడాడు. 1977 లో ఆయనకు “ఆల్ ఇండియా సర్ సింగర్ కాంఫిటీషన్”లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978 లో “జైదేవ్” దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం “గమన్”లో పాడుటకు ఒప్పందం చేసుకున్నాడు. ఆయన పాడిన “అజీబ్ సా నహ ముఝ్ పార్ గుజర్ గయ యారో” పాటకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్‌ అవార్డు లభించింది. అదే విధంగా జాతీయ అవార్డుకు నామినేట్ చేయబడింది.

హరిహరణ్ ను ఎ.ఆర్. రెహమాన్ 1992 లో తమిళ చిత్రసీమకి మణిరత్నం దర్శకత్వంలోని ‘రోజా’ సినిమాతో పరిచయం చేశాడు. ఈ సినిమాలో “తమిఝ తమిఝ” అనే దేశభక్తి గీతం పాడించారు. తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిర్మింపబడ్డ ‘బొంబాయి’ సినిమాలో “ఉరియే ఉరియే” పాటకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నేపథ్యగాయకునిగా ఎంపికయ్యారు. ఈ పాటను హరిహరన్ కె.ఎస్.చిత్రతో కలసి పాడారు. రెహమాన్ తో పని చేసిన గాయకులలో ముఖ్యమైనవాడు హరిహరన్. ‘ముత్తు’, ‘మిన్సార కనవు’, ‘జీన్స్’, ‘ఇండియన్’, ‘తాల్’, ‘రంగీలా’, ‘ఇందిర’, ‘ఇరువర్’, ‘అంబే, ‘శివాజి’ మరియు ‘గురు’ వంటి మొదలైన అనేక సినిమాలలో పాటలు పాడారు. 1998 లో హిందీ సినిమా ‘బార్డర్’ లో అను మల్లిక్ సమకూర్చిన ‘మేరే దుష్మన్ మేరే భాయీ’ పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయకునిగా అవార్డు అందుకున్నాడు. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన 2009 లో ‘అజయ్ అతుల్’ ట్యూన్ చేసిన ‘జోగ్వా’ సినిమాలోని ‘జీవ్ రంగ్లా’ పాటను మరాఠీ భాషలో పాడి జాతీయ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన మొత్తంగా 500కు పైగా దక్షినాది భాషలలో, దాదాపు 1000కి పైగా హిందీ పాటలు పాడారు. ఆయన మరెన్నో మధురమైన పాటలను పాడుతూ శ్రోతలను అలరించాలని ఆశిస్తూ బర్త్ డే విషెస్ అందిస్తుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!