అందమైన.. అమాయకమైన ముఖం.. ఎప్పుడూ చిరునవ్వు చిగురించే పెదవులు.. ఆకట్టుకునే అభినయం.. ఆకర్షించే గ్లామర్ ఆమెకు దక్షిణాది తెరమీద కథానాయికగా అవకాశాలు తెచ్చిపెట్టాయి. కేరళలో పుట్టి పెరిగి.. అక్కడ కథానాయికగా రాణించి.. ఆపై తెలుగు, కన్నడ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఆమె పేరు భావన. అయితే మాతృ భాష మలయాళంలో తప్ప.. ఆమె ఇతర భాషల్లో అంతగా రాణించలేకపోయింది.
భావన అసలు పేరు కార్తీక మేనన్. త్రిసూర్ జిల్లాలో జన్మించింది. సినిమాటోగ్రాఫర్ జి. బాలచంద్రన్ కూతురైన భావన తెలుగుతో పాటు తమిళం, మలయాలం, కన్నడ భాషలో నటించి పేరు తెచ్చుకొంది. తెలుగు తెరకు ఆమె ‘ఒంటరి’ చిత్రంతో పరిచయమైంది. ‘హీరో’, ‘మహాత్మ’, ‘నిప్పు’ చిత్రాల్లో నటించింది. ఈమె నటిగా తెలుగు ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసింది కానీ విజయాల్ని మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మళ్లీ ఎక్కువగా మలయాళం, కన్నడ చిత్రాలపైనే దృష్టిపెట్టింది. పదహారేళ్ల వయసులోనే కథానాయికగా తెర ప్రవేశం చేసిందామె. తన బాయ్‌ఫ్రెండ్ అయిన కన్నడ నిర్మాత నవీన్‌ని 2018 జనవరిలో వివాహమాడింది. నేడు భావన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ మల్లూ కుట్టికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే భావన