అందమైన ముఖం.. ఆకర్షించే కళ్ళు.. మధువులొలికే పెదవులపై సౌందర్యం ఉట్టిపడే పుట్టుమచ్చ. చిరునవ్వుకు చిరునామా. దానికి నాజూకైన నడుము కూడా తోడైతే.. ఆమె పేరు సిమ్రాన్. అందం, అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ. ఇటు గ్లామర్ ను అటు అభినయాన్ని బాలెన్స్ చేస్తూ వెండితెరమీద ఒకప్పుడు పండువెన్నెలలు కురిపించింది ఆ అందం. 1990, 2000 దశకంలో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ ఒక ఊపు ఊపిన సుందరి ఆమె.

అబ్బాయిగారి పెళ్లి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌ని కొనసాగించింది. ‘ప్రియా ఓ ప్రియా’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘ఆటోడ్రైవర్‌’, ‘సమర సింహారెడ్డి’, ‘అన్నయ్య’, ‘కలిసుందాంరా’, ‘నువ్వు వస్తావని’, ‘యువరాజు’, ‘మృగరాజు’, ‘నరసింహనాయుడు’, ‘ప్రేమతోరా’… ఇలా విజయవంతమైన పలు చిత్రాల్లో సిమ్రన్‌ నటించింది. ‘సీతయ్య’,  చిత్రంలో సీనియర్‌ నటుడు హరికృష్ణ సరసన కూడా నటించి అందాలు ఒలికించిందామె. 2004 వరకు అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె ఆ తరువాత ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేసింది. 

2003లో చిన్ననాటి స్నేహితుడైన దీపక్‌ని వివాహం చేసుకొంది సిమ్రన్‌. ఈ జంటకి అదీప్, ఆదిత్‌ అనే ఇద్దరబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన సిమ్రన్‌ పలు కీలక అవకాశాల్ని చేజిక్కించుకొంది. 2019లో రజనీకాంత్‌తో కలిసి ‘పేట’లో నటించి మెప్పించింది. నేడు అందాల సిమ్రాన్ పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ పంజాబీ కుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!