కరోనా సెకండ్ వేవ్ తీవ్రత సినీ పరిశ్రమపై గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అటూ ఉత్తరాదిన ఇటూ దక్షిణాదిన కూడా ఇటీవల ఈ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సినిమా రంగంపై కరోనా అంతులేని విషాదాన్ని నింపుతోంది. తాజాగా ప్రముఖ హిందీ నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్పాల్ కరోనాతో మరణించారు. బిక్రమ్‌జీత్ మృతి పట్ల బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
బిక్రమ్‌జీత్ సినిమా రంగంలోకి ప్రవేశించక ముందు ఇండియన్ ఆర్మీలో మేజర్ గా 2003లో రిటైర్మెంట్ తీసుకుని తర్వాత నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. హిందీలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌ల్లో సహా నటుడిగా నటించి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో రామ్‌చరణ్ ‘జంజీర్’, రానా ‘ఘాజీ అటాక్’, ప్రభాస్ ‘సాహో’ వంటి సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు.