Bigboss 8 : బుల్లితెర ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్వాహకులు సరైన సమాధానం ఇచ్చేశారు. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్ హౌస్‌కు తలుపులు తెరుచుకుంటాయి. ఈ సీజన్‌ను మరోసారి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు.

ఈ సీజన్‌లో ఎవరెవరు హౌజ్‌లోకి ఎంటరవుతారనేది ప్రస్తుతం తెలుగు టీవీ ప్రేక్షకులలో హాట్ టాపిక్. కిరాక్ ఆర్పీ, బర్రెలక్క, సోనియా సింగ్, కుమారి ఆంటీ వంటి పాపులర్ పేర్లు ఈ సీజన్‌లో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎవరు హౌజ్‌లోకి ఎంటరవుతారో తెలియాలంటే మనం సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే. ప్రతి సీజన్‌లా ఈ సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, ఆటలు, పనులు అన్నీ కలిపి ఒక ఎమోషనల్ జర్నీని ప్రేక్షకులకు అందిస్తుంది.

Leave a comment

error: Content is protected !!