Bhulbulayya 3 : కార్తిక్ ఆర్యన్ మరోసారి రూహ్‌ బాబాగా మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. “భూల్‌ భులయ్యా” ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగం “భూల్‌ భులయ్యా 3″కి అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తిక్‌ ఆర్యన్‌తో పాటు త్రిప్తి దిమ్రీ, విద్యాబాలన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, కార్తిక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రీతో సహా చిత్రబృందం కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం మధ్యప్రదేశ్‌కు బయల్దేరింది. ముంబయి, కోల్‌కతాల్లో ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి ప్రధాన షెడ్యూల్‌ మధ్యప్రదేశ్‌లోని పురాతన పట్టణం ఓర్చాలో జరగనుంది.

“ఓర్చాలోని పలు చారిత్రక కట్టడాల్లో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. జులై వరకు షూటింగ్‌ కొనసాగించి, చిత్రీకరణ ముగించనున్నాం” అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో సీనియర్‌ నటి మాధురి దీక్షిత్‌ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. “భూల్‌ భులయ్యా 3” ఈ దీపావళికి విడుదల కానుంది.

 

 

Leave a comment

error: Content is protected !!