మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి మాస్ ఇమేజ్ గురించే చాలా మందికి తెలుసు.. కానీ పంక్చువాలిటీకి కేరాఫ్ అడ్రస్.. ఆయన పర్‌ఫెక్షనిస్ట్. సినిమాకు సంబంధించి ఓ ఎన్‌సైక్లోపీడియా…ఈ మాట చెప్పింది భోళాశంకర్ కు సినిమాటోగ్రఫీ చేసిన డూడ్లీ. చిరు మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ భోళాశంకర్ ఆగస్ట్ 11 న రిలీజ్ కాబోతున్న సందర్భంగా డీఓపీ డూడ్లీ పాత్రికేయులతో ముచ్చటించారు.
మెగాస్టార్ పంక్చువాలిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఏడు గంటలకు షాట్ ఓపెనింగ్ అంటే మేకప్‌తో రెడీగా ఉంటారన్నారు. బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్స్‌తో పనిచేసిన డూడ్లీ అసలు పేరు రాజేంద్రనట. తమిళనాడు ఊటీ ఆయన స్వస్థలం. బాలీవుడ్ స్టార్స్‌కు సౌత్ స్టార్స్‌కు ప్రధాన తేడా పంక్చువాలిటీ అన్నారు. ప్రొఫొషనలిజం, పంక్చువల్ విషయంలో చిరును మ్యాచ్ చేసే స్టారే లేడన్నారు డూడ్లీ.
వేదాళం రీమేక్ అయినా చిరు ఇమేజ్ కు స్టైల్ కు తగ్గ మార్పులు చేసామన్నారు. ఇక భోళాశంకర్ షూట్ టైమ్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ తీయడం అత్యంత కష్టమనిపించిందన్నారు. పెద్ద యాక్షన్ సీక్వెన్స్.. ఒరిజినల్ వెర్షన్ వేదాళంలో చాలా బాగా తీసారు. దానికంటే భిన్నంగా ఎట్రాక్టివ్‌గా తీయడానికి చాలా కష్టపడ్డామన్నారు.
తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఇతర ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్‌రమేష్ డైరెక్టర్. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11 న రిలీజ్ కాబోతుంది భోళాశంకర్.