Bharateeyudu 2 : లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లోరూపొందుతున్న యాక్షన్ మూవీ భారతీయుడు 2. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం ట్రైలర్ త్వరలోనే విడుదల కానుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇంక ఈ సినిమా నుంచి తాత వస్తాడే… అదరగొట్టి పోతాడే… అంటూ సాగే పాట శుక్రవారం విడుదలైంది. ఈ పాటకు అనిరుధ్ సంగీతం సమకూర్చగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం రాశారు. అరుణ్ కౌండిన్య పాటను ఆలపించారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం జులై 12న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!