Bharateeyudu 2 : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “భారతీయుడు 2”. ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూలై 7 ఆదివారం.. హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. “భారతీయుడు 2” 1996లో విడుదలైన “భారతీయుడు” సినిమాకు సీక్వెల్.
28 ఏళ్ళ తర్వాత మళ్ళీ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జే. సూర్య, బాబీ సింహా, వివేక్ తదితరులు నటించారు.

Leave a comment

error: Content is protected !!