Shopping Cart 0 items - $0.00 0

భానుమతిగారి మొగుడు

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం ‘భానుమతిగారి మొగుడు’. డి.వి.యస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి.వి.యస్.రాజు నిర్మించిన ఈ సినిమా 1987, నవంబర్ 19 న విడుదలై అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. విజయశాంతి నాయికగా నటించిన ఈ సినిమాలో అశ్విని, రంగనాథ్, గిరిబాబు, రాజేశ్, బాలాజీ, పరుచూరి వెంకటేశ్వరరావు, నాగేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. .జయకృష్ణ ఒక పల్లెటూరికి చెందినవాడు. సినిమాలో హీరో అవుదామని పట్నానికి వచ్చి.. ఫైనల్ గా స్టంట్ మాస్టర్ గా సెటిల్ అవుతాడు. అయితే అతడు అనుకోని పరిస్థితుల్లో ఒక అహంకారి అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య కొన్ని గొడవలు తలెత్తుతాయి. చివరికి వారిద్దరూ ఎలా వారి సమస్యలనుంచి బైట పడతారు అన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్, రాధ జంటగా నటించిన ‘తెర్కత్తిక్కల్లన్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్టవ్వడంతో .. కోదండరామిరెడ్డి ఈ కథలో కొన్ని మార్పులు చేసి తెలుగు వెర్షన్ ను తెరకెక్కించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.  

Leave a comment

error: Content is protected !!