Bhale Unnade movie : దర్శకుడు మారుతి సమర్పణలో రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. ఈ చిత్రాన్ని జె.శివసాయి వర్ధన్‌ తెరకెక్కించగా.. ఎన్‌.వి.కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. మనీషా కంద్కూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించారు.
ఈ నెల 7న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల తేదీని మార్చి, ఈ నెల 13కి వాయిదా వేశారు.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి, కొత్త విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. చిత్ర బృందం మాట్లాడుతూ, ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన వినూత్నమైన కథాంశంతో రూపొందిందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్‌ చంద్ర అందించారు. కొత్త విడుదల తేదీతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!