Bhaje Vayuvegam trailer : యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘భజే వాయు వేగం’. ఈ మూవీ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం ప్రసాద్స్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో చిత్రబృందం ఆవిష్కరించింది. ట్రైలర్‌ చాలా ఫాస్ట్ గా సాగుతూ.. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి టైటిల్ కు న్యాయం చేసింది.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే హీరో కార్తికేయ తన తండ్రి ఆపరేషన్ కోసం లక్షలు సంపాదించే ప్రయత్నం చేస్తాడు. పోలీసులు, రెండు ఖతర్నాక గ్యాంగ్‌లు అతని వెంట పడటంతో ప్రాణాంతకమైన, ఉత్కంఠభరితమైన ట్రైయాంగ్యులర్ క్రైమ్ హంట్ లో ఇరుక్కుంటాడు. కథలో ప్రధాన భాగం ఒకే రోజులో జరిగినట్లు ఉంది. కపిల్ కుమార్ అందించిన ఉత్తేజకరమైన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘భజే వాయు వేగం’ చిత్రంలో ఐశ్వర్యా మేనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించింది. రాధన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!