Bhaje Vayuvegam : యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ సంయుక్త బ్యానర్‌పై కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న “భజే వాయు వేగం” . ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రాహుల్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. అజయ్ కుమార్ రాజు.పి. నిర్మించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఈ చిత్ర ట్రైలర్ ను మే 25వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తో మరింత హైప్ పెరుగుతుందని చిత్రబృందం ఆశిస్తుంది. “భజే వాయు వేగం” సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం.

 

Leave a comment

error: Content is protected !!