ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించేది ఇన్‌స్టా రీల్స్‌ లో కనిపించేది నిజమే నే చెబుతున్నా సాంగ్. ఊరి పేరు భైరవ కోన కోసం శేఖర్‌ చంద్ర కంపోజ్‌చేసిన ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్‌ పాడారు. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో బంపర్‌ హిట్ అయ్యింది. 30 మిలియన్ వ్యూస్‌ను క్రాస్‌ చేసి శరవేగంగా దూసుకుపోతుంది. శ్రీమణి ఈ పాట రాసారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన తీరుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
సిద్ శ్రీరామ్‌, శేఖర్‌ చంద్ర కాంబినేషన్‌లో ఇప్పటికే “బాగుంటుంది నువ్వు నవ్వితే”, “ప్రియతమా ప్రియతమా” “మనసు దారి తప్పెనే” లాంటి సూపర్‌ హిట్ సాంగ్స్‌ వచ్చాయి. ఇప్పుడు “నిజమే నే చెబుతున్నా ” పాట సూపర్‌హిట్ అయ్యింది. యూట్యూబ్‌ లో ఇన్‌స్టాలో వైరల్‌ అవుతోంది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉందీ సాంగ్‌. ఈ సాంగ్ ఇంతలా ఓన్‌ చేసుకున్న మ్యూజిక్‌ లవర్స్‌కి స్పెషల్ థ్యాంక్స్‌ చెబుతున్నారు మేకర్స్‌.

Leave a comment

error: Content is protected !!