నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్. 
ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.
పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.
భగత్ సింగ్ నగర్ టైటిల్ తోనే మూవీ పై క్యూరియాసిటిని పెంచి ప్రకాష్ రాజ్ లాంటి నటులతో శబాష్ అనిపించుకొని ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చారు చిత్రయూనిట్. అంతకొత్తవారితో డిఫరెంట్ కథ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు మెప్పించిందో సమీక్ష లో చూద్దాం

 

 కథ : భగత్ సింగ్ నగర్ బస్తీ (హైదరాబాద్ ఒక స్లమ్ ఏరియా) లో శ్రీను (విదార్థ్),శ్రీ లక్ష్మీ (ధృవీక)లు ప్రేమికులు.. శ్రీను కు తల్లి (ప్రభావతి) శ్రీ లక్ష్మీ కి తాత చంద్రయ్య (మునీ చందర్ ) తమ్ముడు (మాస్టర్ పాంచజన్య) ఉన్నారు.. శ్రీను, చంద్రయ్య ఇంకా వీళ్ల స్నేహితులు కూలీ పనులు చేసి, వచ్చిన డబ్బులతో తాగి జల్సా చేస్తుంటారు. అనూహ్యంగా స్లమ్ ఏరియాల్లో యువతులు కిడ్నాప్ అవుతుంటారు .. పోలీసులు న్యాయం చేయకపోగా బస్తీ వాసుల పాలిట తలనొప్పిగా తయారవుతారు… వీళ్ల ఎం ఎల్ ఏ కూడా అపోజిషన్ తప్పిదంగా మాట్లాడి, నేరస్తులకే సహకరిస్తాడు… ఈ క్రమంలోనే చంద్రయ్య, కిడ్నాప్ అయిన యువతులను కిడ్నాపర్స్ ఒక డెన్లో దాచి హింసిస్తున్న విధానం చూసి, భయపడి పోయి తన మనవరాలు శ్రీ లక్ష్మీ ని, తన శిష్యుడు శ్రీను కిచ్చి పెళ్లి చేసి, తన బరువు దించుకోవాలనుకుంటాడు.. శ్రీను, శ్రీలక్ష్మి ల పెళ్లికి అందరూ అంగీకరిస్తారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఆ జంటకి అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది? అసలా ఆ సంఘటనే కథను మలుపు తిప్పింది. ఈ కథంతా చంద్రయ్య ద్వారా తెలుసుకున్న షార్ట్ ఫిలిం మేకర్ భగత్ (విదార్థ్) చలించిపోతాడు.. ఇంతకీ ఆ జంట కి ఎదురైన సంఘటన ఏంటి? స్లమ్ ఏరియా యువతులనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు? ఈ క్రైమ్ లో ఎవరు కీ రోల్ పోషిస్తున్నారు.. ? అసలీ క్రైమ్ ఎందుకు చేస్తున్నారు? పోలీస్ ల పాత్రేంటి? భగత్ మరియు అతని స్నేహితులు చేదిస్తే విస్తుపోయే విషయాలు బయట పడుతాయి.. అవేంటో తెరమీదే చూడాలి.

కథనం : స్లమ్ ఏరియాలో నివసించే వాళ్ళ జీవన విధానాన్ని తెరకెక్కిచ్చిన  విధానం బాగుంది.  బస్తి వాళ్ళ అమాయకత్వం, ఆవేశం, ఆనందాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలను రియలిస్టిక్ ప్రజెంట్ చేయగలిగారు. ఈ సినిమా లో చంద్రయ్య చెప్పే కథలోని పాత్రలను  భగత్ తన కుటుంబ సభ్యులనే ఊహించుకోవడం కొత్తగా ఉంది. అంతే కాదు ఆ ఊహే ఈ చిత్ర కథా గమనానికి బలాన్ని చేకూర్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. సేకవండాఫ్ పట్ల ఆసక్తిని కలిగిస్తుంది.  సెకండ్ హాఫ్లో భగత్ ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను కలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో మూల కథను రివీల్ చేసీనా ఎక్కడా బోర్ లేకుండా డ్రైవ్ చేసే లా గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి అటు కథా కథనాలను ఇటు సినీ ప్రేక్షకులను ఒప్పించే విధానం బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ లో వచ్చే సాంగ్ చాలా బాగుంది. అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ సినిమా మీద ప్రేమ, సమాజం పట్ల బాధ్యత తో ఒక మంచి ప్రయత్నం చేశారనిపిస్తుంది. 

నటీనటుల పర్ఫార్మెన్స్ – మొదటి సినిమా ఐనప్పటికి బాగా న్యాచురల్ గా నటించారు హీరో విదార్థ్. ముఖ్యంగా ఫస్టాఫ్ స్లం ఏరియా లో ఉండే కుర్రాడి లా సెంకండాఫ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా ఒక  గెటప్ విషయం లోనే కాకుండా యాక్టింగ్ విషయం లో కూడా ఆ తేడాని చూపించాడు. ఇక డాన్స్ ఫైట్స్ లోను మెప్పించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ లో ఎంతో రిలియలిస్ట్ చేసాడు. ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉన్న నటుడు అనిపిస్తోంది . ఇక హీరోయిన్ ధృవీక కి కూడ మొదటి చిత్రమే ఐనప్పటికి బాగానే చేసింది. ఇంటర్వెల్ సీన్ లో ఐతే ఏకంగా ఏడిపించేసింది. ఈ చిత్రం లో ముఖ్యంగా చెప్పుకోవల్సిన పాత్ర తాత చంద్రయ్య ( మునిచంద్ర ) పాత్ర. ఈ క్యారెక్టర్ మూవీ చాలా కి కీలకం. ఇంత ఇంపార్టెంట్స్ ఉన్న పాత్ర ని చాల అలవోకగా నటించి మెప్పించారు మునిచంద్ర.బ్యాడ్ కాప్ గా బెనర్జీ నటన మూవీ కి ఓ పెద ఎస్సెట్. ఇక మంచి తనం ముసుగు లో ఉండే డాక్టర్ రవి ప్రకాష్ విషయం లో వచ్చే ట్విస్ట్ ని  ఊహించలేం. ఫైనల్ గా డైరెక్టర్ వాలాజా క్రాంతి విషయానికొస్తే మొదటి చిత్రమైనప్పటికి మంచి కథ ని ఎంచుకోవడమే కాదు డీల్ చేసిన విధానం కూడ ఆకట్టుకుంటుంది. ఎస్పెషల్లి సస్పెన్స్ ని గుప్పుట్లో పెట్టుకొని చివరి వరకు రివీల్ చెయకుండా డ్రైవ్ చేసుకుంటూ వెల్లిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

సాంకేతిక వర్గం : మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ముగారి పాటలు బాగున్నాయి . ముఖ్యంగా ఓ బొజ్జ గణపయ్యా, విశ్వాంతము వ్యాపించిన పాటలు హైలెట్. ఇక కెమెరా రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి వర్క్ బాగుంది.బీచ్ లో డ్రోన్ షాట్స్ బాగా వచ్చాయి. ఈ సినిమా ప్రొడ్యూజర్స్ వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు మంచి అభిరుచి ఉన్న నిర్మాతలని ఈ సినిమా ని చూస్తే తెలుస్తుంది. కథని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా ని నిర్మించారు.ఇండస్ట్రీ మరో పాషన్ ఉన్న ప్రొడ్యూజర్స్ దొరికారనుకోవచ్చు. 

 

బోటం లైన్ –  సస్పెన్స్ ట్విస్ట్ల తో ఆకట్టుకున్న సామాజిక చిత్రం 

రేటింగ్ : 3.5/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

 

 

Leave a comment

error: Content is protected !!