అత్యవసరాలకు డబ్బు అవసరమైతే.. ఉపయోగపడేది బంగారమే. గోల్డ్ లోన్‌ తీసుకోవాలంటే రాళ్ల వేల్యూను తీసేసి బంగారానికి లెక్కకట్టి లోన్ ఇస్తూ ఉంటారు. అయితే మీ బంగారంతో పాటు రాళ్ల విలువను కూడా లెక్కకట్టి గోల్డ్ లోన్‌ ఇస్తామంటున్నారు బెనకా గోల్డ్‌ కంపెనీ. ఈ కంపెనీకి సహజనటి జయసుధ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులో మంచి పేరు తెచ్చుకున్న బెనకా గోల్డ్ కంపెనీ యాడ్ హెడ్‌ ఆఫీస్‌ను హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో జయసుధ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సంస్థ యాడ్‌ డైరెక్టర్‌ దీపక్‌ ఆవుల మేడమ్‌ మనం యాడ్‌ చేద్దాం అనగానే వెంటనే ఓకే అనేశాను. ఆ కంపెనీ యం.డి భరత్‌ కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని కోరుకుంటున్నా’’ అన్నారు జయసుధ.

‘‘ తెలుగు రాష్ట్రాల్లో మేము 20 బ్రాంచిలను ప్రారంభిస్తాం’’ అన్నారు బెనకా గోల్డ్‌ సంస్థ యండి యస్‌ భరత్‌కుమార్‌ .

జయసుధ గారి వంటి గొప్ప నటితో కలిసి పనిచేయటం ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది అన్నారు యాడ్‌ డైరెక్టర్‌ ఆవుల దీపక్‌.

Leave a comment

error: Content is protected !!