Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ చివరి సినిమా “అల్లుడు అదుర్స్”. ఆ తర్వాత కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. దీనికి తోడు “ఛత్రపతి” హిందీ రీమేక్ డిజాస్టర్ తో బాగా వెనకబడ్డాడు. అయితే ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడేమో.. బెల్లంకొండ శ్రీనివాస్ కథల ఎంపికలో వేగం పెంచుతున్నట్టు కనిపిస్తోంది.

లుదీర్ అనే కొత్త దర్శకుడితో ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షూటింగ్ ఆగస్ట్ నుండి ప్రారంభం కానుంది. అలాగే….. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఒక ఫాంటసీ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాడు. ఈ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది.

శ్రీనివాస్ ప్రస్తుతం “టైసన్ నాయుడు” మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ జాప్యం వల్ల విడుదల వాయిదా పడిన ఈ చిత్రం, ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. ఈ రెండు కొత్త సినిమాలు, “టైసన్ నాయుడు” సక్సెస్ తో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో మళ్లీ ఊపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!