Bellamkonda Srinivas : టాలీవుడ్ యాక్షన్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘చావు కబురు చల్లగా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ కూడా ఆయన లైన్‌లో ఉంది.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని, మూన్‌షైన్ పిక్చర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి తమ తొలి చిత్రాన్ని ప్రకటించింది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఇంక ఈ చిత్రం తరువాత, బెల్లంకొండ శ్రీనివాస్ ‘నాంది’ ఫేమ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరో నారా రోహిత్ మరొక ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా విభిన్న దర్శకులతో కలిసి పని చేస్తుండటం ఆయన కెరీర్‌లో మరో మలుపుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ విజయవంతం కావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!