ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న బరాబర్ ప్రేమిస్తా చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్. వి. రుద్ర దర్శకత్వం వహించారు. Cc క్రియేషన్స్ పతాకంపై గెడా చందు, గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, యాక్షన్‌లతో కూడిన ఎంటర్‌టైనర్. చంద్రహాస్, మేఘన ముఖర్జీ యువతను ఆకట్టుకునే జంటగా కనిపించనున్నారు. ఆర్. ఆర్. దృవన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సురేష్ గంగుల అందించిన గీతాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!