అల్లరి నరేశ్ కామెడీ టైమింగ్ ను సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ.. నవ్వులే నవ్వులు. అలాంటి ఓ అల్లరోడి స్టైలాఫ్ మూవీ ‘బంగారు బుల్లోడు. పి.గిరి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. పూజా ఝవేరి కథానాయికగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అల్లరి నరేష్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బంగారు బుల్లోడు చిత్రం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ మొత్తం  నవ్వులతో ముంచెత్తాడు అల్లరి నరేష్.  

పల్లెటూరి వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలని తమ అవసరాల కోసం వాడుకొని తిరిగి బ్యాంకులో పెట్టే ఉద్యోగులతో కామెడీ సన్నివేశాలతో ఈ టీజర్ నిండిపోయింది. ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ కూడా అందుకే పెట్టారేమో. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి ప్రవీణ్, పృథ్వీ రాజ్, సత్యం రాజేష్,  వెన్నెల కిశోర్,  ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్ ఆచంట తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బంగారు బుల్లోడు’ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీజర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=rtBm6iN949s&feature=youtu.be

 

 

 

 

Leave a comment

error: Content is protected !!