Shopping Cart 0 items - $0.00 0

శోభన్ బాబు ‘బలిపీఠం’ చిత్రానికి 45 ఏళ్ళు

నటభూషణ్ శోభన్ బాబు సినీ కెరీర్ లో మరపురాని సందేశాత్మక చిత్రం ‘బలిపీఠం’. రవిశంకర్ ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై వై. సునీల్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు దాసరి నారాయణరావు. 1975 లో విడుదలైన ఈ సినిమా 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఊర్వశి శారద కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. నిర్మలమ్మ, రోజారమణి, రాజబాబు, హేమలత, అల్లు రామలింగయ్య, మురళీమోహన్, శ్రీవిద్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

 దళితుడైన భాస్కర్ .. జబ్బు పడ్డ బ్రాహ్మణ యువతి అరుణను తన భార్యగా స్వీకరిస్తాడు. భాస్కర్ మంచి తనానికి ముగ్ధురాలైన అరుణ తిరిగి కోలుకొని  అతడితో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది. ఇంతలో భాస్కర్ అక్క వారితో కలిసి జీవించాడానికి ఆ ఇంటికి వస్తుంది. ఆమె అలవాట్లు, కట్టుబొట్టు వ్యవహారం, మాటతీరు అరుణకు వెగటుగా అనిపించి.. తన మేనమామ దగ్గరకి వెళ్లిపోతుంది. అక్కడ ఆమెను డబ్బుకోసం వేధిస్తారు. దాంతో ఆమె తిరిగి జబ్బున  పడుతుంది. ఆ పరిస్థుతుల్లో ఆమెను భాస్కర్ అక్క, వారి కుటుంబం నిండు మనసుతో స్వీకరిస్తారు. వారి స్వచ్ఛమైన  మనసుకు పశ్చత్తాపడిన అరుణ్ చివరికి భాస్కర్ చేతుల్లోనే కన్నుమూస్తుంది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిన అదే పేరుతో ఉన్న నవలను దాసరి తనదైన శైలిలో సినిమా గా మలిచారు. కులాంతర వివాహం చేసుకొన్న వారి అవస్థను చూపిస్తునే.. మానవత్వ విలువల్ని కూడా ఉన్నతంగా చూపించడంతో ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని బాగా అలరించింది. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి తరం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.  ముఖ్యంగా కుశలమా నీకు కుశలమేనా, కలిసి పాడుదాం తెలుగుపాట లాంటి పాటలు మెలోడీ టచ్ తో మెప్పిస్తాయి.

 

Leave a comment

error: Content is protected !!