రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా తెలుగులోకి డబ్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. హైదరాబాద్ వచ్చే యువతీ యువకుల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిన్న కథను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ కథ యువతకు బాగా కనెక్ట్ అయింది.
ఈ మూవీలోని హీరో పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. అతను చేసిన క్యారెక్టర్, చెప్పిన డైలాగ్స్ చాలా కామెడీని పండిచాయి. తెలుగులో సచిన్ పాత్రకు గాత్రదానం చేసిన ఘనత దుర్గా అభిషేక్ కు దక్కుతుంది. సినిమా చూస్తున్నంత సేపు అది డబ్బింగ్ సినిమా అని గుర్తుకు రాదు. ఈ పాత్ర ప్రేక్షకులకు అంతగా నచ్చడానికి ప్రధాన కారణం డబ్బింగే.
దుర్గా అభిషేక్ ఇప్పటివరకు 300 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా దుర్గా అభిషేక్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరో పాత్రకు గాత్రదానం చేయడానికి దుర్గా అభిషేక్ ఎంత కష్టపడ్డాడో చూసిన వారికి అర్థమవుతుంది. హీరో పాత్ర మనకు అంతగా రిలేట్ అవ్వడానికి గల కారణం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది.
నిజానికి హీరో అవుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దుర్గా అభిషేక్ .. తన తండ్రి బాటలో డబ్బింగ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 300 సినిమాల వరకూ డబ్బింగ్ చెప్పాడు. ఇంక మరో సర్ ప్రైజ్ లాంటి విషయం ఏంటంటే.. దుర్గా అభిషేక్.. బాలకృష్ణ నటించిన భలేవాడివే బాసు లో ప్రకాష్ రాజ్ కొడుకుగా నటించి మెప్పించాడని చాలా తక్కువ మందికే తెలుసు.