బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కలయికలో వస్తున్న మూడవ చిత్రం ‘బిబి౩’ ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయం కాలేదు. ఈ సినిమాకి పని చేస్తున్న ప్రముఖ లిరిక్ & డైలాగ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి తన ఆనందాన్ని మూవీ వాల్యూంతో పంచుకున్నారు.

బోయపాటి గురించి ప్రస్తావిస్తూ తనకు అన్నం పెట్టిన దర్శకుడు తన అభిమాన హీరో బాలక్రిష్ణ, తను ఎంతగానో ప్రేమించే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. వాళ్ళతో జరుగుతున్న తన ప్రయాణం ‘బిబి౩’. బోయపాటి శీను కి తన పై గల ప్రేమకి ఇంత గొప్ప ప్రెస్టేజియస్ మూవీకే కాకుండా తను చేసే ప్రతి ప్రాజేక్ట్లోను తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే బోయపాటి బాలకృష్ణ కలయికలో వచ్చిన మునుపటి చిత్రాలు ‘సింహా’ ‘లెజెండ్’ వారి కెరియర్ లో బెంచ్ మార్క్ మూవీస్ గా విజయాన్ని పొందాయి. అంచనాలు పెంచడం కాదు కాని ఇప్పుడు వస్తున్న ‘బిబి౩’ కూడా తప్పకుండా బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చెప్పారు. ఓ సందర్భంలోసినిమాకి మొదటిపాట రాయాల్సింది నువ్వే కదా ఇంకా రాయలేదా అని మనుసులతో  మమేకం అయ్యే మనస్తత్వంబోయపాటిది అని, ఈ సినిమాకి పనిచేయడం బాలకృష్ణ పక్కన నిల్చోడం ఆయనతో జర్నీ చేయడం ఒక అభిమానికి బిగ్గెస్ట్ మూమెంట్ ఏముంటుందని చెప్పారు.

బాలకృష్ణ రచయితలను ఎంతగానో గౌరవిస్తారని, తనలోని క్రమశిక్షణ, సమయపాలన అనేది తెలుగు చిత్రానికి దైవం నందమూరి తారక రామారావు గారి నట వారసత్వాన్ని తీసుకుని టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన్ని ప్రేమించని వారేవరుంటారు. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు తో పాటు ప్రచారాన్ని ఇష్టపడని వ్యక్తిత్వం ఆయనిది. కళాకారుడి బాధ్యతే సమాజానికి ఎంతో కొంత మేలు చేయడం అనేది అన్నగారు చేసిన ఎన్నో చిత్రాలలో స్పూర్తిని కలిగించాయి. బోయపాటి కి తెలుగు భాష పట్ల తనకు విపరీతమైన పట్టుందని, సమకాలిన సంఘటనలతో స్క్రిప్ట్ తయారు చేస్తారని, తన సినిమాలలోదాదాపుగా ఇంగ్లిష్ రాయడాన్ని అవాయిడ్ చేస్తారని చెప్పారు. రత్నం గారు బాలయ్యకు రాసే డైలాగ్స్ గురించి చెప్పనవసరం లేదు. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి వంటి సినిమాల సీన్ ఎమోషన్స్ కి తగట్టు తను రాసే డైలాగ్స్ మునుపటి సినిమాల కన్నా గొప్పగా ఉంటాయని తెలిపారు. తమన్ స్వరాలు వింటుంటే బాలయ్య పై ప్రేమతో ఇచ్చిన అధ్బుతమైన ట్యూన్స్ రేపు అభిమానులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆంధ్రుల అభిమాన హీరో, అగ్ర హీరో అయిన బాలక్రిష్ణతో పాటు కలిగిన ఈ రవ్వంత పరిచయం రవ్వంత ప్రయాణం కొండంత భాగ్యంగా భావిస్తున్నట్లు తన ఆనందాన్ని మూవీ వాల్యూం తో పంచుకున్నారు.

Leave a comment

error: Content is protected !!