Balakrishna :  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, మే 28న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందని తెలిపారు.

ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడం చాలా ప్రత్యేకంగా ఉంది. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో “గిరి గిరి” అనే మాస్ సాంగ్‌ను బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట వినగానే థియేటర్‌లో రెస్పాన్స్ మామూలుగా ఉండదు.  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం యాక్షన్, అడ్వెంచర్ కథాంశంతో రూపొందించబడింది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ కథలో విశ్వక్ సేన్‌ది మంచి పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!