ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. ప్రత్యేకించి ఇండియాలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించి అప్పుడే వంద రోజులు పూర్తయిపోయింది. ఈ పరిస్థితుల్లో కరోనాతో కలిసి ప్రజలందరూ సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ మాస్క్ మేండేటరీ అయిపోయింది. మాస్కులు ధరించనిదే ఎవరినీ ఎక్కడికీ అలౌవ్ చేయడం లేదు. అందుకే స్టే హోమ్ స్టేసేఫ్ అనే నినాదాన్ని అందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి గ్రాఫిక్స్ డిజైనర్ కమల్ కణ్ణన్ వినూత్నం గా తన సందేశాన్ని దర్శకుడు రాజమౌళికి పంపించాడు.

‘బాహుబలి’ చిత్రం క్లైమాక్స్ లో ప్రభాస్, రానా నటించిన ఒక సన్నివేశంలో వారిద్దరికీ మాస్కులు అప్లై చేసి.. తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కమల్ కణ్ణన్. అతడు మార్ఫ్ చేసిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి గుడ్ వర్క్ అని అతడి పనితనాన్ని ప్రశంసించాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a comment

error: Content is protected !!