నువ్వు నేను.. 2001లో విడుదలయిన ఈ మూవీ యూత్‌ను ఎంతలా ఎట్రాక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతోనే అనిత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చిత్రం మూవీలో బక్కపలుచగా కనిపించిన ఉదయ్‌కిరణ్ కండలు పెంచి కనిపించాడు. ఈ సినిమాతోనే ఆర్పీ పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. ఇక డైరెక్టర్ తేజ చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారాడు. ఇక ఈ చిత్రంలో మరో పెద్ద ఎస్సెట్ నెగటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ చేసిన తెలంగాణా శకుంతల. ఈ సినిమా క్యాస్టింగ్ సెలక్షన్ టైమ్‌లో చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందట.ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో.. మీ పెద్దోళ్లున్నారే అంటూ ఉదయ్‌కిరణ్ ఇమ్మెచ్యూర్డ్ డైలాగ్ డెలివరీతో చెప్పే మాటలు కూడా అంతే పెద్ద హిట్టయ్యాయి. పాల వ్యాపారి కూతురు హీరోయిన్. ఆమె మేనత్త తెలంగాణా శకుంతల. నా ఇలాఖాలో ఇంకోసారి పేమా అనే మాట వినపడిందో నరుకుతా.. అంటూ ప్రేమన్నా, ప్రేమికులన్నా ద్వేషించే పాత్రలో తెలంగాణా శకుంతల జీవించిందనే చెప్పాలి. కానీ ఈ క్యారెక్టర్ కు తెలంగాణా శకుంతల కాకుండా ఇంకెవరైనా సెలెక్ట్ అయ్యుంటే..? ఊహకు కూడా అందట్లేదు కదూ.. కానీ ఇలా జరిగుండేదే..!
తెలంగాణా యాసతో ఫేమస్ అయిన శకుంతల ఇంత నెగిటివ్ రోల్‌ను అంతకు ముందు చేసి ఉండలేదు. కానీ శకుంతల గారినే సెలెక్ట్ చేసారు తేజ. కానీ ఎందుకో సందేహం కలిగిందట చేయగలదా లేదా అని. ఉన్నట్టుండి ఆమెను పక్కనబెట్టి బెంగుళూరు పద్మను పిలిపించారట. కానీ తనికెళ్ల భరణి తేజ దగ్గరికి వచ్చి తెలంగాణా శకుంతల సీనియర్, పైగా స్టేజ్ ఆర్టిస్ట్.. ఆమెను పక్కన బెట్టడం అంత మంచి నిర్ణయం కాదని చెప్పారట. అంతే తేజ మళ్లీ తెలంగాణా శకుంతలను పిలిపించడం.. ఆమె క్యారెక్టర్ చేయడం, విపరీతంగా ఫేమ్ రావడం జరిగాయి.